- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
by Ajay Maddhiboyina |
మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. ఉచిత బస్ ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. ఉచిత బస్ ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని అన్నారు. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్సు నుండి దించేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వయంగా ఆర్టీసీ యూనియన్ నాయకులే తనకు ఈ మాట చెప్పారని అన్నారు. ఫ్రీ బస్ పథకం వల్ల మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఫ్రీబస్ పథకం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలతో పాటు కాలేజీ, స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులకు సైతం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
Next Story






