- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీపై బిజెపి నేత సీరియస్ కామెంట్స్
టీటీడీనీ అప్రతిష్టపాలు చేసేలా వైసీపీ వ్యవహారం.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీపై బిజెపి నేత భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ రాజకీయం కోసం దేవుడిని వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) పరకామణి చోరీని చిన్నదిగా అభివర్ణించడాన్ని తప్పుబడ్డారు. ఇది అత్యంత దారుణమైన విషయంగా పేర్కొన్నారు. దొంగతనంలో వైయస్ జగన్ కు చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం అనే కొలతలు ఉన్నాయని విమర్శించారు. దొంగతనంలో కొలతలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ ఆలయ పవిత్ర జగన్ కు తెలుసా? అటువంటి ఘటనే చర్చిలో జరిగి ఉంటే.. అదే విధంగా మాట్లాడేవారా అని వైయస్ జగన్ ను ప్రశ్నించారు. తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యం కావడం వైసీపీ కుట్ర అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారని తెలిపారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు టార్గెట్ తిరుమల లక్ష్యంతో పని చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక అబద్ధపు ప్రచారాలతో, ఆధారాలు లేకుండా టీటీడీని (TTD) టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలంటే అంత లోకువైందా అని నిలదీశారు.






