బంగారం షాపుల్లో బీఐఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. వ్యాపారులకు స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-06 12:29:33  IST  )

బంగారం షాపుల్లో బీఐఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు...

బంగారం షాపుల్లో బీఐఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. వ్యాపారులకు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో బీఐఎస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు కలకలం రేపాయి. ఉదయం 11 గంటల నుంచే బంగారం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులను లోపలికి అనుమతించకుండా సోదాలు చేశారు. హాల్ మాల్ లేకుండా బంగారం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పలు షాపులపై దాడి చేశారు. హాల్ మార్క్‌తో పాటు ఆభరణాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలు పాటించని పలు షాపులను గుర్తించారు. తక్కవ నాణ్యత బంగారాన్ని విక్రయించినట్లు నిర్దారించారు. బంగారంపై నకిలీ హాల్ మార్క్ వేసినట్లు తేల్చారు. ఈ షాపులకు జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని తెలిపారు. నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) అధికారులు హెచ్చరించారు.

Next Story