- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ ను ఢీకొట్టిన బైకు.. ఒకరు మృతి
తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లాలో (Prakasam District) చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లాలో (Prakasam District) చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ బాధాకరమైన ఘటన మర్రిపూడి మండలంలోని తంగేళ్ల దగ్గర శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. డేవిడ్ అనే వ్యక్తి తన బైకు పైన ప్రయాణిస్తున్నాడు. మర్రిపూడి మండలంలోని తంగేళ్ల మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. చీకటిలో ప్రయాణిస్తున్న క్రమంలో ముందున్న వాహనాన్ని ఢీకొట్టాడు. అతని బైకు ట్రాక్టరును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన డేవిడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లాలో..
ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటన గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఆగి ఉన్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందినవారు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మృతదేహాలను నల్లపాడు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






