పవన్‌పై ఆరోపణలు.. దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్

by Ajay Maddhiboyina |

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

పవన్‌పై ఆరోపణలు.. దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నుండి పవన్ కల్యాన్ నెలకు రూ.50 కోట్లు తీసుకుని ఆయనను ప్రశ్నించడం లేదని అన్నారు. దువ్వాడ చేసిన కామెంట్లపై జనసేన నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దువ్వాడపై 353(2),351(2) BNS, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు 35(3) నోటీసు జారీ చేశారు.

ఇదిలా ఉంటే గతంలో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో ఉన్నారు. కానీ ఆయన భార్యను వదిలి మాధురిని రెండో వివాహం చేసుకోవడంతో ఆయనపై, వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దువ్వాడ, దివ్వెల సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కుటుంబాన్ని సమాజాన్ని పట్టించుకోకపోవడంతో వైఎస్ జగన్ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇవ్వడం బిగ్ షాక్ అనే చెప్పాలి. గతంలో ఆయన వైసీపీ కోసమే విమర్శలు చేయగా ఆ పార్టీ సస్పెండ్ చేసింది. మరోవైపు టీడీపీ, జనసేనను విమర్శించారు కాబట్టి ఆ పార్టీల్లోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Next Story