అనంత‌పురంలో వైసీపీకి ఊహించ‌ని దెబ్బ‌.. కీల‌క నేత రాజీనామా

by Ajay Maddhiboyina |

అనంత‌పురంలో వైసీపీకి ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి షేక్ నియాజ్ అహ్మ‌ద్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.

అనంత‌పురంలో వైసీపీకి ఊహించ‌ని దెబ్బ‌.. కీల‌క నేత రాజీనామా
X

దిశ‌, వెబ్ డెస్క్: అనంత‌పురంలో వైసీపీకి ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి షేక్ నియాజ్ అహ్మ‌ద్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ స‌మ‌క్షంలో నియాజ్ అహ్మ‌ద్ టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వేల మంది అనుచ‌రుల‌తో నియాజ్ బైక్ ర్యాలీని చేప‌ట్టారు. ఇదిలా ఉంటే ఏపీలో అధికారం కోల్పోయిన త‌ర‌వాత వైసీపీలో వ‌రుస రాజీనామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌త నెలలో తూర్పుగోదావ‌రి జిల్లాలోని గోపాల‌పురం మండ‌లానికి చెందిన 50మంది వైసీపీ నాయ‌కులు ఒకేసారి రాజీనామా చేశారు. మండలంలో పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో పార్టీకి మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు. ఇలా గ్రామాలు ప‌ట్ట‌ణాల్లో పార్టీల నుండి చాలా మంది వెళ్లిపోవ‌డంతో పార్టీకి తీవ్ర‌న‌ష్టం జ‌రుగుతోంది. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే భ‌విష్య‌త్ లో వైసీపీకి మ‌రింత మైన‌స్ అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Next Story