సీఎంపై అనుచిత పోస్టులు: వైసీపీ నేతలు శ్రీహరి, గిరీష్‌కుమార్‌కి బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు పుడి శ్రీహరి, గిరీష్‌కుమార్‌రెడ్డిలకు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది....

సీఎంపై అనుచిత పోస్టులు:  వైసీపీ నేతలు శ్రీహరి, గిరీష్‌కుమార్‌కి బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ(Ycp) నేతలు పుడి శ్రీహరి, గిరీష్‌కుమార్‌రెడ్డిలకు రాష్ట్ర హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరికీ ఊరటనిస్తూ గతంలో కుప్పం కోర్టు(Kuppam Court) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. దీంతో పుడి శ్రీహరి, గిరీష్‌కుమార్‌రెడ్డి బెయిల్ కేన్సిల్ కానుంది. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేయనున్నారు.

శ్రీహరి, గిరీష్‌కుమార్‌రెడ్డికి బెయిల్

కాగా చంద్రబాబుపై అనుచిత పోస్టులు చేసిన కేసులో కుప్పం కోర్టు పుడి శ్రీహరి, గిరీష్‌కుమార్‌రెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఈ కేసులో విజయవాడలో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో వీరిద్దరి తరపు వాదనలను కోర్టు అంగీకరించింది. ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది.

Next Story