- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు బిగ్ షాక్.. మహిళా కమిషన్ నోటీసులు
మాజీ మంత్రి అమర్ నాథ్‌కు బిగ్ షాక్ తగిలింది. హోంమంత్రి వంగలపూడి అనితను ‘మేకప్’ మంత్రి అని విమర్శించడంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. వివరణతో పాటు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అమర్ నాథ్‌కు బిగ్ షాక్ తగిలింది. హోంమంత్రి వంగలపూడి అనితను ‘మేకప్’ మంత్రి అని విమర్శించడంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. వివరణతో పాటు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళలను కించపర్చేలా వ్యవహరించారని మండిపడింది. మహిళా ప్రతినిధులపై వ్యక్తిగత విమర్శలు తగదని సూచించింది. తమరు చేసిన వ్యాఖ్యలు సమాజంలో తప్పుడు సంకేతాలకు దారితీస్తాయని మహిళా కమిషన్ తెలిపింది. విచారణకు హాజరుకావాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో జిల్లాలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ హోంమంత్రి అనితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిని మేకప్ మంత్రి అంటూ విమర్శలు కురిపించారు. దీంతో కూటమి నేతలతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమర్ నాథ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే అమర్‌నాథ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనపై కేసులు పెట్టినా తాను చేసిన విమర్శలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. తనను, తమ పార్టీ అధినేతలను హోంమంత్రి అనిత కించపర్చే కామెంట్స్ చేశారని అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు తాను వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే అలా అన్నానని అమర్ నాథ్ స్పష్టం చేశారు. దీంతో అమర్ నాథ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.






