బిగ్ బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్లాంట్ ఎస్ఎంఎస్ - 2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలిచారు. ప్రమాదంపై వెంటనే విచారణ జరిపి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.


Next Story