రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ నెల కూడా కష్టమే!

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్ర రేషన్ కార్డుదారులకు ( Ration card Holders) బిగ్ అలర్ట్. ఈ నెల కూడా ఏపీ రేషన్ కార

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ నెల కూడా కష్టమే!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్ర రేషన్ కార్డుదారులకు ( Ration card Holders) బిగ్ అలర్ట్. ఈ నెల కూడా ఏపీ రేషన్ కార్డుదారులకు ఆ అవకాశం దక్కడం లేదు. ఏపీలో ప్రతి రేషన్ కార్డుకు మే నెల నుంచి కందిపప్పు ( Kandipapu) అందుతుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే కందిపప్పు వస్తుందని ఆశించిన రేషన్ కార్డుదారులకు... ఊహించని షాక్ తగిలింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి.. కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని సమాచారం అందుతుంది. అలాగే రేషన్ డీలర్లు కూడా కందిపప్పు కు సంబంధించిన డబ్బులను చెల్లించలేదని తెలుస్తోంది. ఎండియూ (MDU) వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం మొదలుపెట్టినప్పటికీ.. కందిపప్పు విషయంలో జాప్యం జరుగుతోంది. రేషన్ కార్డు ద్వారా... అన్ని సరుకులు ఇస్తున్నప్పటికీ కందిపప్పు విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది.

దీంతో రేషన్ కార్డులు దారులు డీలా పడిపోతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి.. పంచదార అలాగే రేషన్ బియ్యం మాత్రమే కార్డు లబ్ధిదారులకు అందుతుంది. బియ్యంతో పాటు అరకిలో పంచదార ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక కందిపప్పు జూన్ మాసం నుంచి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేయనుంది కూటమి ప్రభుత్వం. అటు రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ గడువును ( E - KYC) కూడా.. జూన్ 3వ తేది వరకు పొడిగించింది.

Next Story