బిగ్ అల‌ర్ట్‌... ఇవాళ, రేపు వర్షాలు

by velandi.Saikiran |

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది.

బిగ్ అల‌ర్ట్‌... ఇవాళ, రేపు వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు చలి తగ్గినప్పటికీ, గత నాలుగు రోజులుగా విపరీతంగా చలి పెరిగిపోయింది. దీంతో ఉదయం పూట రోడ్లపై మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా రోడ్లపై ఉన్న పొగ మంచు పోవడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇవాళ, రేపు వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కూడా కురిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూడు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది.

Next Story