AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఏపీలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం(AP Government) కీలక మార్పులు చేసింది. నేటి(ఆదివారం) నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌(Mobile app)లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండు నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకుretariat employees) ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఒకసారే ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ అందరికీ SMSలు పంపారు. గతంలో ఉద్యోగులు సచివాలయానికి వచ్చినప్పుడు లేదా వెళ్లే సమయంలో ఒకసారి హాజరు వేసుకున్న సరిపోయేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం రెండు సమయాల్లో కూడా హాజరు వేసుకోవాలని ఆదేశించింది.

Next Story