విద్యార్థులకు బిగ్ అలర్ట్.. APRCET నోటిఫికేషన్ విడుదల

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. APRCET నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీని ద్వారా పీహెచ్.డి (Phd) కోర్సులకు అడ్మిషన్లు (PhD Admissions) ఇవ్వనున్నారు. ఈ నోఫికేషన్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ అప్లికేషన్లను అర్హత గల అభ్యర్థులు 07-10-2025 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ లేదా.. సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్లను కూడా చూడవచ్చని అధికారులు సూచించారు.

Next Story