- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. AP EAPCET-2025 హాల్ టికెట్లు విడుదల
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET-2025 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET-2025 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థులు నేటి నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/నుంచి గాని లేదా మనమిత్ర వాట్సప్ (9552300009) నెంబర్‌తో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కాగా, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను మే 21 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సెకండ్ సెషన్ల వారీగా పరీక్షలన నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట హాల్‌టికెట్, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని మే 21న, ఇంజినీరింగ్ విభాగం కీని మే 28 తేదీన విడుదల చేస్తారు. ఇక ఫైనల్ ఆన్సర్ కీని జూన్ 5న వెల్లడించాక తుది ఫలితాలను విడుదల చేస్తారు.






