రాజమహేంద్రవరం చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు

by Seetharam |   (  Updated:2023-09-27 11:27:42  IST  )

దేవుడు ఉన్నాడు-నాకు దారి చూపిస్తాడు అంటూ నారా భువనేశ్వరి ఇటీవలే తన భర్త టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రాజమహేంద్రవరం చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేవుడు ఉన్నాడు-నాకు దారి చూపిస్తాడు అంటూ నారా భువనేశ్వరి ఇటీవలే తన భర్త టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు రావాలంటూ ఆమె ఇప్పుడు దేవాలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇటీవలే అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నారా భువనేశ్వరి. తాజాగా బుధవారం భువనేశ్వరి రాజమహేంద్రవరంలోని లూథరన్ చర్చికి వెళ్లారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన భర్త చంద్రబాబు నాయుడును విడుదల చేసేలా కరుణించాలని ప్రార్థనలు చేశారు. అలాగే తమ కుటుంబంతోపాటు రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకున్నారు. అనంతరం నారా భువనేశ్వరి అక్కడ నుంచి రాజానగరం నియోజకవర్గం సీతానగరం బయలుదేరి వెళ్లారు. సీతానగరంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనేశ్వరి సీతానగరం దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించనున్నారు.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story