వేంకటేశ్వరస్వామి భక్తుడిగా ఛాలెంజ్ చేస్తున్నా.. దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి : భూమన కరుణాకర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-21 07:24:18  IST  )

తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న నిందితుల్ని బయటకు లాగేందుకు రంగం సిద్ధమైన వేళ.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

వేంకటేశ్వరస్వామి భక్తుడిగా ఛాలెంజ్ చేస్తున్నా.. దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి : భూమన కరుణాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న నిందితుల్ని బయటకు లాగేందుకు రంగం సిద్ధమైన వేళ.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని పక్కదోవ పట్టించామని తమపై అనవసరమైన ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సీబీఐతో విచారణ చేయించాలని ఛాలెంజ్ చేశారు. పరకామణి చోరీని బయటపెట్టిందే తామని, రవికుమార్ 20 ఏళ్లుగా స్వామివారి సొమ్మును దోచుకున్నాడని, 15 సంవత్సరాలు చంద్రబాబు హయాంలోనే చోరీలు జరిగాయని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అతను ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటే రూ.100 కోట్లను కూడబెట్టి ఉంటాడని ప్రశ్నించారు. తమ హయాంలోనే ఆ చోరీ విషయం బయటికి వచ్చిందని, రవికుమార్ ను పట్టుకుని రూ.100 కోట్లు రికవరీ చేశామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఛాలెంట్ చేస్తున్నా.. దమ్ముంటే సీబీ సీఐడీతో కాదు.. సీబీఐతో పరకామణి వ్యవహారంపై విచారణ చేయించాలని భూమన కరుణాకర్ ఛాలెంజ్ చేశారు.

కాగా.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు బయటకు రావాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే వ్యక్తి రోజుకు రూ.10 లక్షలు దోచుకెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని, అందరూ కలిసి రూ.100 కోట్లను పంచుకున్నారని తెలిపారు. ఆపదమొక్కుల వాడి ఖజానాకే భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సీసీ ఫుటేజీలో 100 డాలర్ల నోట్ల కట్ట తీస్తున్నట్లు క్లారిటీగా కనిపించిందని, అందులో 112 నోట్లు ఉంటాయన్నారు. కానీ విజిలెన్స్ రిపోర్టులో మాత్రం 9 నోట్లే దొరికినట్లు చెప్పారన్నారు. ఈ విజిలెన్స్ రిపోర్టులో పోలీస్ అధికారి ఒత్తిడితో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నామని పేర్కొన్నామని, ఆ పోలీస్ అధికారి ఎవరో తేలాలన్నారు. ఇది లోక్ అదాలత్ లో ఉండాల్సిన కేసు అని, క్రిమినల్ కేసు అని అన్నారు. ఒక్కసారి స్వామివారి హుండీలోకి వెళ్లిన సొమ్ము ఏదైనా స్వామివారి ఆస్తేనని, ఆ ఆస్తిని వీరంతా ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు.

Next Story