భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారు.. భానుప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) రాజకీయ నిరుద్యోగిగా మారారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారు.. భానుప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) రాజకీయ నిరుద్యోగిగా మారారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi)ని ఉద్దేశించి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన వీడియలో సంచలనం సృష్టిస్తోంది. టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆయన అసభ్యకర పదజాలంతో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై విరుచుకుపడ్డారు. అయితే, వైసీప ప్రభుత్వ హయాంలో ఆమె పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

తాజాగా, ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఖండించారు. మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో అందరికీ తెలియదా అని ఎద్దేవా చేశారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలు జరిగాయనేది వాస్తవం కాదా అని ఫైర్ అయ్యారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాక రాజకీయ నిరుద్యోగిగా మారారని సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని భానుప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Next Story