- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భక్తుల ఆధార్ వివరాలు అడిగితే.. అసత్య ప్రచారం చేస్తారా?’: భాను ప్రకాష్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం పై ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం పై ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారని తెలిపారు.
ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ తరుణంలో శ్రీవారి భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో మూడంచెల భద్రతతో భక్తులకు టీటీడీ భద్రత కలిపిస్తోందన్నారు. మఠాల్లో భక్తులను ఆధార్ వివరాలు అడగడం హిందూ ధర్మం పై దాడి కాదన్నారు.
మఠాల్లోనూ భక్తుల ఆధార్ వివరాలు తీసుకుని వసతులు కల్పించాలని నోటీసులిస్తే.. హిందూ ధర్మం, మఠాల పై దాడి అని మాట్లాడతారా? అని మండిపడ్డారు. ఈ క్రమంలో అసలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందే వైసీపీ అని భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు. భక్తుల భద్రత కోసమే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే దాని పై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని తెలిపారు.






