రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి : ముఖ్యమంత్రి చంద్రబాబు

by Thanuru Gopichand |

భక్త కనకదాస (Bhakta Kanakadasa) జయంతిని ఏపీలో రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని

రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి : ముఖ్యమంత్రి చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : భక్త కనకదాస (Bhakta Kanakadasa) జయంతిని ఏపీలో రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. కనకదాస జయంతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. భక్త కనకదాసు కేవలం కన్నడ ప్రజలకే కాదు.. తెలుగు ప్రజలకు కూడా సుపరిచితులన్నారు. ముఖ్యంగా కురుబ (Kuruba) సామాజికవర్గానికి భక్త కనకదాస ఆరాధ్యుడని పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా పేరు పొందారన్నారు. తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్రంలో అధికారిక పండుగగ జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. భక్త కనకదాస సాహిత్య, సంగీత, సామాజిక సేవలను స్మరించుకోవడమే కాదు ప్రతిఒక్కరూ ఆయన నుంచి స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షించారు.

Next Story