‘అన్యమతాల వారికి టీటీడీ సత్రం కాదు’.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-11 06:00:40  IST  )

అన్యమతాల వారికి టీటీడీ ధర్మసత్రం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ​అన్నారు.

‘అన్యమతాల వారికి టీటీడీ సత్రం కాదు’.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్​ బ్యూరో: అన్యమతాల వారికి టీటీడీ ధర్మసత్రం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ​అన్నారు. టీటీడీ ఎవరి ఆస్తి కాదు, హిందువులది మాత్రమే అని తెలిపారు. ఈ రోజు(శుక్రవారం) ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని ప్రార్థించానన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలు గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. కొండగట్టు, కరీంనగర్​ రామాలయాలను అభివృద్ధి చేయాలని టీటీడీ చైర్మన్​కు విజ్ఞప్తి చేశారు. వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Next Story