Balakrishna : పొలిటికల్ రోల్ లో బాలకృష్ణ బీజీ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-22 11:45:59  IST  )

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమా షూటింగ్ ల(Movie Shootings)కుషార్ట్ బ్రేక్(Short break)తీసుకుని..తన పొలిటికల్ రోల్(Political Role)లో బిజీ(Busy) అయ్యారు.

Balakrishna : పొలిటికల్ రోల్ లో బాలకృష్ణ బీజీ !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమా షూటింగ్ ల(Movie Shootings)కుషార్ట్ బ్రేక్(Short break)తీసుకుని..తన పొలిటికల్ రోల్(Political Role)లో బిజీ(Busy) అయ్యారు. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ట మూడు రోజులుగా నియోజవర్గం పర్యటనలో బిజీ గా సాగుతున్నారు. పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలుస్తు నియోజకవర్గంలో మూడవరోజు ఎమ్మెల్యే బాలకృష్ణ తన పర్యటన కొనసాగించారు.

పర్యటనలో భాగంగా హిందూపురం రూరల్ గోళాపురం లో 3కోట్ల 48 లక్షల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. వేసవి కాలం మొదలవుతున్న తరుణంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్య వల్ల ఎంతోమంది రైతులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో కొత్తగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుతో రైతులకు, పరిశ్రమదారులకు లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు. కేంద్రం అందిస్తున్న సోలార్ సబ్బిడీ ప్యానల్స్ ను ఏర్పాటును ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

స్టీల్ ప్లాంట్ కు, రాజధానికి, రైల్వే జోన్ కు, పోలవరంకు సహకరిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలని చెప్పారు. కేంద్రం నిధుల సహకారంతో ఏపీ ప్రభుత్వం నుంచి హిందూపురం నియోజకర్గం అభివృద్ధి పనుల మంజూరీలో వేగం పెరిగిందన్నారు. హిందూపురానికి మంచి భవిష్యత్ ఉందని.. నా నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక నిధులు ఇస్తున్నారని బాలకృష్ణ వెల్లడించారు.

కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఢాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న బాలకృష్ణ, ఆ వెంటనే ప్రయాగరాజ్ మహా కుంభమేళలో ఆఖండ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ విరామంలో తనను వరుసగా మూడోసారి ఎమ్మె్ల్యేగా ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో నియోజకవర్గంలో వరుసగా మూడు రోజులు పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వం సహకారంతో పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండటం విశేషం. అలాగే మరికాసేపట్లో అనంతపురంలో జరిగే తన సినిమా ఢాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ కు బాలకృష్ణ హాజరుకాబోతున్నారు.

Next Story