ఆయేషా మీరా హత్యకేసు పునర్ విచారణ .. అక్టోబర్ 10కి వాయిదా

by Naga Rani Yarlagadda |

18 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్లో బి. ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరాపై హత్యాచారం జరిగింది.

ఆయేషా మీరా హత్యకేసు పునర్ విచారణ .. అక్టోబర్ 10కి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: 18 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్లో బి. ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరాపై హత్యాచారం జరిగింది. ఈ కేసును సీబీఐ పునర్ విచారించి.. కేసులో నిందితుడిగా చేర్చిన సత్యంబాబుపై పెట్టిన ఐపీసీ 376, 302 సెక్షన్లపై 19 సీబీఐ కోర్టుకు హాజరై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పేర్కొంటూ.. ఆమె తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. ఈ మేరకు నేడు ఆయేషా మీరా తల్లిదండ్రులు విజయవాడలో ఉన్న సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ తమ కూతురి హత్యకేసులో అందించిన నివేదిక కాపీని తమకు ఇవ్వాలని కోరుతూ ఆయేషా తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Next Story