- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిఠాపురంలో మహిళపై హత్యాయత్నం
పిఠాపురంలో (Pithapuram) అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : పిఠాపురంలో (Pithapuram) అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ మహిళపై హత్యాయత్నం (Attack On Women) జరిగింది. విధులు ముగించుకొని రాత్రివేళ ఇంటికి వెళ్తున్న మహిళపై హత్యాయత్నం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం పిఠాపురానికి చెందిన సునీత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటుగా పని చేస్తున్నారు. ప్రతిరోజూ విధులకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎప్పటిలాగే విధులను ముగించుకొని తన వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. బైకుపై ఫాలో అవుతూ భయభ్రాంతులకు గురి చేశారు. అయినప్పటికీ వారి నుంచి తప్పించుకునేందుకు సునీత ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తాతయ్యగారి తోట శివారులోని నగరసింగపురం రోడ్డు వద్దకు వచ్చాక బైకుపై వచ్చిన దుండగులు మరింత రెచ్చిపోయారు. పదునైన వస్తువుతో విచక్షణరహితంగా సునీతపై దాడికి పాల్పడ్డారు. వారి అమానవీయ దాడిలో సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన పలువురు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలస్యం చేయకుండా సునీతకు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీత ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యాయత్నం ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.






