- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో దారుణం.. బాలికలపై వృద్ధుడి అఘాయిత్యం
ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని (Prakasam) నర్సాయపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నర్సాయపాలెం (Narsayapalem) పరిధిలో ఆంజనేయులు అనే వ్యక్తి ఉంటున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బాలికలకు మాయమాటలు చెప్పి.. వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అఘాయిత్యం తరువాత బాలికలు అనారోగ్యంతో బాధపడ్డారు. వారిని తల్లిదండ్రులు విచారించగా అసలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. వారి మాటలు విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయి ఆవేదన గురయ్యారు. తాత వయసు ఉన్న వ్యక్తి ముద్దు చేయాల్సిన పిల్లలపై ఘోర పాపానికి ఎలా ఒడిగట్టాడని చలించిపోయారు. ఈ బాధాకరమైన ఘటన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలను చేపట్టారు.






