- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA నందమూరి బాలకృష్ణ ఇలాకాలో దారుణం
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇలాకాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇలాకాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పింఛన్(Pensions) మంజూరు చేసేందుకు ఓ అధికారి రూ. 10 వేలు లంచం కావాలంటూ మహిళను డిమాండ్ చేశారు. దీంతో తన వద్ద డబ్బులు లేక.. లంచం ఇవ్వడానికి తన చెవి పోగులను ఆ మహిళ తాకట్టు పెట్టింది. హిందూపురం(Hindupuram)లోని మోడల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి గమనించిన నెటిజన్లు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజా ప్రతినిధులకు చెడ్డపేరు రావడం ఖాయమని.. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఎన్టీఆర్ భరోసా కింద లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున పింఛన్ చెల్లిస్తోంది. ఇటీవలే కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులు మే 30లోపు వివరాలు జూన్ 1వ తేదీ నుంచి చెల్లిస్తారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
#viralvideo
— greatandhra (@greatandhranews) May 17, 2025
బాలకృష్ణ ఇలాకాలో దారుణం..
పింఛన్ మంజూరు చేసేందుకు రూ. 10 వేలు లంచం కావాలంటూ మహిళను డిమాండ్ చేసిన ఓ అధికారి.
లంచం ఇవ్వడానికి డబ్బు కోసం చెవి పోగులను ఆ మహిళ తాకట్టు పెట్టింది.
హిందూపురం లోని మోడల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంచి ప్రభుత్వం అంటే లంచాలు అడగడమా?… pic.twitter.com/AS0VQ7S89V






