అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దక్కని ఊరట.. జూన్ 2 వరకు రిమాండ్ పొడిగింపు

by Ramesh Naini |

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే. శాంతి (సస్పెండ్) జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది.

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దక్కని ఊరట.. జూన్ 2 వరకు రిమాండ్ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే. శాంతి (సస్పెండ్) జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. ఆమె రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు సార్లు బెయిల్ తిరస్కరణ

జైలు నుంచి బయటకు వచ్చేందుకు శాంతి ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏసీబీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమె బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన శాంతి.. అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు గతంలో ఆమె ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తులు, భూముల పత్రాలు, నగదు, బంగారాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకుని ఆమెను జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు రిమాండ్ పొడిగించడంతో ఊరట దక్కలేదు.

Next Story