- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh: గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ
గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుందని మంత్రి నారా లోకేశ్తెలిపారు.

మంత్రి నారా లోకేశ్వెల్లడి
శ్రీ సిటీలో ఎల్జీ యూనిట్‌కు భూమి పూజ
దిశ, డైనమిక్ బ్యూరో : గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుందని మంత్రి నారా లోకేశ్తెలిపారు.తిరుపతి జిల్లా శ్రీ సిటీలో (Sri City) ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ (LG Electronics) నూతన యూనిట్ కు ఇవాళ ఆయనభూమి పూజ నిర్వహించారు. ఈ యూనిట్ఏర్పాటు ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్మాట్లాడుతూ దేశానికి 70 శాతం ఏసీలు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఎల్జీ యూనిట్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి కల్పన చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఈ పెట్టుబడులు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఇక్కడ పరిశ్రమలు కాదు.. భవిష్యత్తును నిర్మిస్తున్నామని తెలిపారు. మేకిన్ ఇండియా అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలను సాకారం చేసేందుకు ఏపీలో కొత్త పరిశ్రమలను తీసుకువస్తున్నామని లోకేశ్తెలిపారు.
ఏపీ భవిష్యత్‌ను నిర్మిస్తున్నాం..
ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచస్థాయి కేంద్రంగా ఏపీని మార్చాలనే తమ ఆశయాన్ని ఎల్జీ సంస్థ ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులతో ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నాం, స్మార్ట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెప్పారు. భూసేకరణ, నిర్మాణం నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి వరకు ఈ ప్రాజెక్టు ప్రతి దశలోనూ ప్రభుత్వం తరపున నిరంతర మద్దతు అందిస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్యానికి తమ ద్వారాలను తెరిచే ఉంటుందని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణల కోసం, మార్పుకోసం ఏపీ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారత్ లో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, భారత్ లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సీఈఓ జేచియోల్ లియు, ఏకో సొల్యూషన్స్ సీఈఓ జే సంగ్ లీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ జి. శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు






