భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

వైకుంఠ ఏకాదశిని (Vaikunta Ekadashi) పురస్కరించుకొని దేవాలయాల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinajrapu Atchannaidu) అధికారులను ఆదేశించారు.

భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశిని (Vaikunta Ekadashi) పురస్కరించుకొని దేవాలయాల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinajrapu Atchannaidu) అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని వైష్ణవ దేవాలయాలకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా తోపులాటలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు తెలియజేశారు. అందుకోసం పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్ శాఖల అధికారులు ఇతర శాఖల అధికారులను సమన్వయపరచకుంటూ పని చేయాలన్నారు.

Next Story