ఆరోగ్య శ్రీకి రూ. 203 కోట్లు విడుదల.. అయినా వెనక్కి తగ్గని ఆస్పత్రి యాజమాన్యాలు

by srinivas |
ఆరోగ్య శ్రీకి రూ. 203 కోట్లు విడుదల.. అయినా వెనక్కి తగ్గని ఆస్పత్రి యాజమాన్యాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్య శ్రీ సేవల బంద్ కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ కింద సేవలందించిన స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ రూ. 1500 కోట్లు బకాయి ఉంది. దీంతో స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నెట్ వర్క్ ఆస్ప్రతుల్లో ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశాయి. దీంతో ప్రభుత్వం దొగొచ్చింది. రూ. 203 కోట్లు విడుదల చేసింది. అయినా సరే ఆస్పత్రుల యాజమాన్యాలు వెనక్కి తగ్గలేదు. రూ. 500 కోట్లు విడుదల చేస్తేనే ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

దీంతో ఆస్పత్రుల యాజమాన్యులతో ప్రభుత్వం మరోమారు చర్చించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఓసారి చర్చించారు. అయినా సఫలం కాలేదు. కోవిడ్ సమయంలో చేసిన చికిత్సలకు సంబంధించిన బిల్లులు, ఆరోగ్య శ్రీ సేవల నిధులను ఇప్పటివరకూ విడుదల చేయలేదని, బకాయిలు చెల్లించాలని మూడేళ్లుగా కోరుతున్నామని.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నామని స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొనాయి. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ వైద్య సేవలను కొనసాగిస్తామని తెలిపాయి. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ఇన్ పేషెంట్‌గా ఉన్న రోగులకు మాత్రం సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నాయి.

Next Story