- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటమిని ఒప్పకోలేక దొంగ ఏడుపులు ఏడవలేదా? : జగన్‌పై షర్మిల విమర్శలు
by Naga Rani Yarlagadda |
గత ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక జగన్ బీద ఏడుపులు ఏడ్చింది వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జగన్ కు ధైర్యం ఉంటే.. సీఈసీపై పెట్టే అభిశంసనకు మద్దతు ఇవ్వాలని, అందుకు వైసీపీ ఎంపీలంతా సంతకాలు పెట్టాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా జామిలో పర్యటించిన ఆమె.. జగన్ పై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో ఓటమిని ఒప్పుకోలేక ఈవీఎంలు మారిపోయాయని దొంగ ఏడుపులు ఏడ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. నా అక్కచెల్లెమ్మల ఓట్లు ఎక్కడ పోయాయో అని బీద ఏడుపులు ఏడ్చారని గుర్తుచేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట్ల తొలగింపుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. అవసరమైన చోట దొంగ ఓట్లు ఉంచి, అవసరం లేనిచోట్ల ఓట్లు తొలగిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శించారు.
Next Story






