- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | పెద్దలపై పన్నులు వేయాలి : యనమల
సమాజంలో ఆర్థిక అంతరాయాలు పెరిగిపోతున్నాయని.. వాటిని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో ఆర్థిక అంతరాయాలు పెరిగిపోతున్నాయని.. వాటిని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న పన్ను విధానాల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విధానాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పేదలపైనే కాకుండా పెద్దలపై కూడా పన్నులు వేసినప్పుడే సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ధనికులు- పేదల మధ్య అంతరం తగ్గించేందుకు ట్యాక్స్ ది రిచ్ (Tax The Rich) విధానాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని యనమల తెలిపారు. యాభై ఏళ్ల క్రితం ఉన్న పన్ను విధానం నేటి పరిస్థితుల్లో కనిపించడం లేదన్నారు. కార్పొరేట్ పై విధిస్తున్న పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే వ్యక్తిగతంగా విధిస్తున్న ఆదాయ పన్నులే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా కంటే ప్రభుత్వాలకు పరోక్ష పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. విజన్ 2047 లక్ష్యాలను పరిమిత ఆదాయ వనరులతో చేరుకోవడం కష్ట సాధ్యమని అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. పేదలపై భారం మోపకుండా పన్నుల సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
విశాఖను ఐటీ హబ్ చేయడమే సీఎం లక్ష్యం : మంత్రి సుభాష్
విశాఖను నాలెడ్జ్ ఎకానమీ.. ఐటీ హబ్ గా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాగ్నిజెంట్ ప్రారంభం ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పెట్టుబడులు రాకుండా చేయాలని కొందరు బెదిరింపు ఈమెయిల్స్ పంపుతున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయి, ఫ్యాక్షనిజం హబ్ గా విశాఖను మార్చేసిందని విమర్శలను గుప్పించారు. పీపీపీ మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ పేరిట నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ బలం ఎందుకు పడిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ మాత్రం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు.






