- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ఎస్‌ఈసీ (SEC) కసరత్తు ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ఎస్‌ఈసీ (SEC) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికలపై మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సేకరించింది. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అదనంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల డ్యూటీలకు అందించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 17 నాటికి మున్సిపల్ సంస్థల గడువు పూర్తి కానుంది. గ్రామ పంచాయితీల గడువు ఏప్రిల్ 2తో ముగుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంస్థల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీలతో పూర్తవుతుంది. గతంలో మొత్తం 127 మున్సిపాలిటీలలో 87 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించగా, 23 చోట్ల ఎన్నికలు జరగలేదని సమాచారం. ఇక పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరులో రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






