- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర వాయుగుండం...నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చ

*బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం*
*రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాకు వర్షాలు*
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు కూడా తెలిపింది. దీంతో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక అటు విశాఖ, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
ఇటు కృష్ణపట్నంకు చెందిన పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులను అప్రమత్తం చేశారు ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సముద్ర తీర ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరెంటు సమస్యలు వస్తే, వెంటనే పునర్ధరణ పనులు చేయాలని వెల్లడించారు.






