కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు ఏపీ మంత్రి?

by Jakkula.Mamatha |

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా(Mahakumbh Mela) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది

కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు ఏపీ మంత్రి?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా(Mahakumbh Mela) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు(Devotees) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగారాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. అంతేకాదు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మహాకుంభమేళకు చాలామంది రాజకీయ ప్రతినిధులు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లాలని మంత్రి లోకేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మంత్రి లోకేష్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల(ఫిబ్రవరి) 17వ తేదీన మంత్రి నారా లోకేష్ కుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించబోతున్నారు. అలాగే కుంభమేళా నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి కూడా నారా లోకేష్ వెళ్లబోతున్నట్లు ప్రకటన విడుదలైంది.

Next Story