- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Governor speech: వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయింది: అబ్ధుల్ నజీర్
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (AP Assembly meeting) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir) ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చి గెలిపించారని అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు తెలిపారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర గాడిలో పడిందన్నారు.
ప్రతి నెల ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని గవర్నర్ చెప్పారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచినట్లు తెలిపారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అమృత్ జల్ జీవన్ మిషన్‌ను కొనసాగిస్తున్నామని, ప్రతి ఇంటికి కులాయి నీటిని అందిస్తున్నట్లు వివరించారు. జలహారతి కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని గవర్నర్ అబ్ధుల్ నజీర్ తెలిపారు. అంతేకాదు, వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం వంటి విధానాలు అమలు చేస్తున్నామన్నారు.
మెగా పోర్టులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం 161 సేవలు అందుబాబులో ఉన్నాయన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలు చేపట్టినట్లు తెలిపారు. 70 శాతం గ్రామాల్లో ఇంటి దగ్గరే చెత్త సేకరిస్తున్నట్లు వివరించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 20 వేల సీసీ కెమెరాలతో క్లౌడ్ ఆధారిత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యం దిశగా లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని, 17,040 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వివరించారు.
కాగా, గవర్నర్ ప్రసంగం సమయంలోనే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. అనంతరం సభను వాకౌంట్ చేశారు.






