Breaking: ఏపీ శాసనమండలిలో గందరగోళం.. రేపటికి వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-05 09:12:39  IST  )

ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై సభ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది...

Breaking: ఏపీ శాసనమండలిలో గందరగోళం.. రేపటికి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి(AP Legislative Council) రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ నెయ్యి(Tirumala Laddu Ghee) వ్యవహారంపై సభ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల(Ruling, Opposition Parties Mlc) మధ్య వాగ్వాదం జరిగింది. తప్పు తమరిదేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ చర్చ కాస్త హిందు, క్రిస్టియన్ వైపు మళ్లింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే 20219-24 సమయంలో తిరుమలలో అపవిత్రత చోటు చేసుకుందని అధికార పక్ష సభ్యులు ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రతిపక్ష సభ్యులు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ను క్రిస్టియన్ అనడంపై అభ్యంతరం

అయితే జగన్ క్రిస్టియనేనని మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే అనడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడ్డారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు చైర్మన్ పలుమార్లు మండలిని వాయిదా వేశారు. తిరిగి అనంతరం ప్రారంభమైనా ఇదే గందరగోళం నెలకొంది. జగన్‌ను క్రిస్టియన్ అని సంభోదించడంపై వైసీపీ సభ్యులు ఆందోళన.. అసలు జగన్ క్రిస్టియనా కాదా చెప్పాలని మంత్రి అచ్చెన్న డిమాండ్లతో మండలి పలుమార్లు దద్దరిల్లింది. చైర్మన్ ఎంత వారించిని అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, డిమాండ్లతో మండలి హోరెత్తింది. దీంతో మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించింది. దీంతో సభ్యులు మండలి నుంచి వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం ప్రారంభమయ్యే మండలి సమావేశంలో ఇదే తంతు కొనసాగుతుందా...? లేదా హుందాగా సాగుతుందా అనేది చూడాల్సి .

Next Story