- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రమేయం.. ఏపీ ఇంటెలిజెన్స్ సీరియస్
రంగారెడ్డి జిల్లామొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) మొయినాబాద్(Moinabad)లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Former MLA Pilot Rohit Reddy) ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. అయితే ఈ కేసుసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్(TDP MP Putta Mahesh Yadav) ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్(AP Intelligence Department) సీరియస్ అయింది. ప్రధాన నిందితులతో పుట్టా మహేశ్‌కు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు లోతైన విచారణ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇందులోభాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం
మరోవైపు ఈ కేసు అంశాలు ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఘటనలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మరోవైపు ఈగల్ టీమ్ మాత్రం ఎంపీకి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.






