Home Minister Anita :శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-26 07:46:13  IST  )

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం పరిధిలోని పోలీస్ స్టేషన్(Srisailam Police Station)ను ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(AP Home Minister Anita)ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Home Minister Anita :శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం పరిధిలోని పోలీస్ స్టేషన్(Srisailam Police Station)ను ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(AP Home Minister Anita)ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వివరాలు.. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ యుగంధర్ బాబు శ్రీశైలం ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సాక్షి గణపతి, హఠకేశ్వరం పాలధార, పంచదార వద్ధ ట్రాఫిక్ సమస్యలు, టోల్ గేటు మార్పు వంటి సమస్యలను హోం మంత్రికి వివరించారు. వాటిపై అటవీశాఖ, పోలీసు, దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఘాట్ రోడ్డు ఫోర్ లైన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వన్యప్రాణుల రాకపోకలకు సంబంధించి రోడ్డు విస్తరణలో అటవీ శాఖ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు వంటి అంశాలపై ఆయా శాఖలతో చర్చిస్తామన్నారు.

Next Story