- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఈడబ్ల్యూఎస్ సీట్ల కేటాయింపుపై..స్టే విధించిన ఏపీ హై కోర్ట్
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నీట్ యూజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఏపీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ.. తాజాగా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ విద్యార్థులు జీవోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం (ఆగస్టు 13) హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్ వాదనలు వినిపించారు.ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే, ఓపెన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు, జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఆరు వారాలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.