AP High Court: నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-12 11:53:09  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు (Mulakalacheruvu) నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

AP High Court: నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు (Mulakalacheruvu) నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదోపవాదాలను విని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వంతో పాటు డీజీపీలను ఆదేశించింది. అదేవిధంగా సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ (SIT) విచారణలో అసలేం జరగుతుందో కోర్టుకు తెలిపాలని ధర్మాసనం పేర్కొంది.

అంతకు ముందు విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) తన వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ (SIR) విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కాగా, అన్నమయ్య జిల్లా ములకల‌చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ బహిర్గతమైన విషయం సెన్సేషన్ సృష్టించింది. అయితే, కేసులో సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు (A1)తో పాటు టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు రాజకీయ ఘర్షణకు దారి తీశాయి. కేసులో ఎక్సైజ్ పోలీసులు ఇప్పటి వరకు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, మెటీరియల్‌ను కూడా సీజ్ చేశారు. మొత్తం 23 మంది నిందితులు గుర్తించి అందులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

Next Story