Covid: ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....

Covid: ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వైద్యారోగ్య శాఖ(AP Medical and Health Department) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు(Corona cases) నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అడ్వైజరీని ఉపసంహరించుకుంది. కొవిడ్ పరిస్థితులను ప్రతి రోజూ డీఎమ్‌హెచ్‌వో పర్యవేక్షించాలని, ప్రతి కేసును వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కాగా దేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ(Union Health Ministry) అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మూడు కేసుల నమోదు అయ్యాయి. ఏపీ వైద్యా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కొవిడ్ అడ్వైజరీ(Covid Advisory)ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉపసంహరించుకుంది.

Next Story