అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు : స్పెల్లింగ్‌లో మార్పు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-15 07:36:17  IST  )

ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై స్పెల్లింగులో కన్ఫ్యూజన్ లేకుండా ఒకదానిని ఖరారు చేసింది.

అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు : స్పెల్లింగ్‌లో మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇక నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు, నోట్ షీట్లలో రాజధాని పేరును 'అమరావతి'గానే పేర్కొనాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పేరులో మార్పు - 'Thi' కి బదులు 'Ti'

అమరావతి పేరును ఇంగ్లీషులో రాసేటప్పుడు ఇప్పటివరకు విభిన్న స్పెల్లింగ్‌లు వాడుకలో ఉన్నాయి. ఈ గందరగోళాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఒక ప్రామాణిక స్పెల్లింగ్‌ను ఖరారు చేసింది. ఇక నుంచి 'Amaravathi' కి బదులుగా 'Amaravati' అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కొన్ని సందర్భాల్లో రాజధాని పేరు ప్రస్తావనలో అస్పష్టత ఉండేది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ నోట్‌లు అమరావతి పేరుతోనే ఉండాలని ఆదేశించడంతో, పరిపాలన అంతా రాజధాని కేంద్రంగానే సాగుతుందనే బలమైన సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, సచివాలయ విభాగాల్లో ఈ కొత్త మార్పులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

Next Story