- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Govt.: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవాళ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవాళ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గెజిట్‌ను న్యాయశాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిభాదేవి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ నెల 15న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగన కేబినెట్ సమాశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 59 షెడ్యూల్ ఉప కులాలలను వెనుకబాటుతనం, సామాజిక సమైక్యత ఆధారంగా మూడు సముదాయాలు విభజించారు. మొదటి గ్రూప్‌లో 12 ఉప కులాలకు 1 శాతం రిజర్వేషన్, రెండో గ్రూప్‌లో 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్, మూడో గ్రూప్‌లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కేటాయించారు. ఏక సభ్య కమిషన్ నివేదిక, సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లకు 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తుంది. 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండో సైకిల్ అమలు చేయనున్నారు.






