ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 10:20:45  IST  )

పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఏపీ సర్కార్ (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఏపీ సర్కార్ (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ (Anil Kumar Singhal)ను నియమించారు. అయితే, గతంలోనూ ఆయన టీటీడీగా ఈవోగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతోన్న శ్యామల రావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక రెవెన్యూ (ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగా సీహెచ్ శ్రీధర్, కార్మిక శాఖ సెక్రటరీగా శేషగిరి బాబు, గవర్నర్ స్పషల్ సెక్రటరీగా అనంతరాం, ఆర్‌ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కృష్ణ బాబు, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Next Story