ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామాపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామాపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవల ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అరవ శ్రీధర్ రాజీనామాను ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గతంలోనే పేర్కొన్నారు. ఆ రాజీనామా లెటర్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పంపగా.. ఆయన దానిని సంబంధిత అధికారులకు పంపించారు. అరవ శ్రీధర్ రాజీనామా లెటర్ ను పరిశీలించిన అధికారులు దానిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఊహించని పరిస్థితుల్ని, ఆరోపణలను ఎదుర్కొంటున్న తాను.. ప్రభుత్వ విప్ గా బాధ్యతల్ని కొనసాగించలేనని రాజీనామా లెటర్ లో పేర్కొన్నారు.

కాగా.. జనసేన పార్టీ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. వరుసగా అతనిపై ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయడంతో.. కేసు నమోదైంది. కానీ అతనిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేసినా.. ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

Next Story