- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయుగుండం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్
by Thanuru Gopichand |
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో రాష్ట్ర హోం మంత్రి అనిత భేటీ అయ్యారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24 గంటలు అలర్టుగా ఉంచాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని కోరారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Next Story






