తొక్కిసలాట ఘటన.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-01 13:50:57  IST  )

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తొక్కిసలాట ఘటన.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మరణించగా.. మరో 13 మంది గాయపడినట్లు ప్రకటనలో తెలిపింది.

కార్తీకమాసం, శనివారం, ఏకాదశి కూడా కావడం.. ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాక.. తొలి కార్తీక శనివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా 15 వేలమందికి పైగా భక్తులు దర్శనానికి తోసుకోవడంతో రెయిలింగ్ విరిగిపోయిందని, ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగి అక్కడికక్కడే ఏడుగురు మరణించగా, పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరో ఇద్దరు మరణించారని తెలిపింది.

కాగా.. ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలకు సాయంత్రం పోస్టుమార్టం పూర్తవ్వగా.. వాటిని బంధువులకు అప్పగించారు. అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించగా.. ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 పీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఇస్తామని ప్రధాని కార్యాలయం తెలిపింది.

Next Story