- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవయవదానంపై.. మార్గ దర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.!
అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గ దర్శకులు జారీచేసింది. బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించిన అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని.. అధికార యంత్రాంగానికి పలు సూచనలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గ దర్శకులు జారీచేసింది. బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించిన అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని.. అధికార యంత్రాంగానికి పలు సూచనలు జారీ చేసింది. అవయవ దానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్, మెడికల్ సూపెరిండెంట్ లేదా జీవన దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని.. అధికారులకు స్పష్టం చేశారు. జీవన్మృతుడికి సంబంధించిన భౌతిక కాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని, అంత్య క్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేలా చర్యలను చేపట్టాలని మార్గదర్శకాలు జారీచేశారు. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్ధిక సహాయంతో పాటూ .. జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.






