అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ షురూ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-13 12:07:00  IST  )

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామం లో భూముల సమీకరణకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది..

అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ షురూ
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం(Ap Goverment) రెండో విడత భూ సమీకరణ (LPS 2.0) ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామం(Pedaparimi Village)లో భూముల సమీకరణ(Lands Assimilation)కు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధాని కోర్ ఏరియాకు ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో సుమారు 3,072 ఎకరాల (మొత్తం ప్రతిపాదిత 6,000 ఎకరాల్లో మొదటి విడతగా) భూమిని సేకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి అత్యంత కీలకమైన 11 ప్రధాన రహదారులు (Trunk Roads) ఇక్కడే కలవనుండటం, అలాగే ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కనెక్టివిటీ, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టులకు ఈ భూములు కీలకం కానున్నాయి.

మెరుగైన ప్యాకేజీని ఇచ్చేలా కసరత్తు

రాజధాని పరిధిని మరింత విస్తరించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేవలం 29 గ్రామాల్లోనే రాజధానిని పరిమితం చేస్తే అది ఒక మున్సిపాలిటీలా మిగిలిపోయే ప్రమాదం ఉందని, అందుకే మెట్రోపాలిటన్ నగరంగా ఎదగాలంటే అదనపు భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పెదపరిమి రైతులు రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు వస్తుండగా, ప్రభుత్వం వారికి మొదటి విడతలో ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీని ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఈ భూ సమీకరణతో అమరావతి రూపురేఖలు మారిపోవడమే కాకుండా, ఈ ప్రాంతం ఆర్థికంగా పెద్ద ఎత్తున వృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story