ధూపదీప నైవేద్యం స్కీం.. రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు

by Vemula.Srinu Prasad |

దేవాలయాలు, అర్చకులకు ఏపీ ప్రభుత్వం మరింత ఆర్థిక సాయం ప్రకటించింది..

ధూపదీప నైవేద్యం స్కీం.. రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: దేవాలయాలు(Temples), అర్చకుల(Priests)కు ఏపీ ప్రభుత్వం(Ap Government) ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ధూపదీప నైవేద్యం కింద అర్హత ఉన్న ప్రతి దేవాలయం నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇస్తోంది. అటు అర్చకులకు గౌరవ భత్యం సైతం అందజేస్తోంది.


అయితే దేవాలయాల అభివృద్ధిపై ఈ రోజు దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సమస్యల పరిష్కారానికి గ్రీవెల్స్ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆనం మాట్లాడుతూ కొత్తగా 141 ఆలయాలకు ధూపదీప నైవేద్యం స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. నెలసరి చెల్లింపును రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కింద నెల్లూరు జిల్లాలో మొత్తం 58 ఆలయాలకు రూ. 118.45 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రెండు ఏళ్లలో ఆలయాల పున: నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు.

Next Story